Monday, December 30, 2019

🌹మధూలిక🌹 తొలి కవితా సంకలనం

Hi friends....

It's an eBOOK బట్ ఇట్స్ myBOOK 🌺🌺 మధూలిక🌺🌺 Published

ఫేస్బుక్ వాల్ మీద పోస్ట్ చేసినా, గుప్పెడు అక్షరాలతో గ్రూప్స్ లో గుభాళించినా, మీరందరు నా కవితలు చదివి ఇచ్చిన స్పందనలు మనసులో ఉత్సాహం నింపింది అన్నది ఎంత నిజమో అంతకన్నా ఎక్కువ ప్రేరణనిచ్చి మరెన్నో భావాలు అక్షరీకరించేలా చేసింది అన్నది అంతే నిజం. వెలకట్టలేని మీ అభిమానానికి సదా ఋణపడి ఉంటాను. భావాలన్నీ ఒకేచోట ఉండాలని బ్లాగ్ లో, అలాగే ఫేస్బుక్ పేజీలో పొందుపర్చాను.

కానీ పుస్తకరూపంలో ఉంటే ఇంకా ఎక్కువ మందికి చేరుతాయి మరియు జీవితపుటలో అదొక మధురానుభూతి. కవనసాగరంలో కొన్ని ముత్యాలను సేకరించి కవితాసంపుటిగా ప్రచురించాలన్నది నా కోరిక మరియు నన్ను అభిమానించే మిత్రులందరి ఆకాంక్ష. సాంప్రదాయపద్దతిలో ప్రచురణ కాస్త వ్యయప్రయాసలతో కూడుకొని ఉంటున్ది, కనుక ఆధునిక పద్దతిలో (ePublication) చాలా సులభతరంగా, చరవాణిలో కూడా చక్కగా చదువుకొనే విదంగా అందుబాటులోకి వచ్చింది. అందుకే అంతర్జాల మాధ్యమంలో ఈ ప్రచురణ ఇష్టమైన వారికి ఇన్స్టంట్ కాఫీ ఆన్ ఫాస్ట్ ట్రాక్.

*మధూలిక* అనుభూతిస్తే తియ్యని తేనె ప్రవాహం, ఆస్వాదిస్తే సుమగంధం. పన్నెండు విభాగాలతో 156 కవితపుష్పాల పుప్పొడితో మిమ్మల్ని అలరించటానికి సిద్ధంగా KINIGEలో సిద్ధంగా ఉంది.  http://kinige.com/book/Madhulika హైపర్ లింక్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకొని చదివి ఎప్పటిలా మీ స్పందనలు తెలియచేయమని మిత్రులందరిని పేరు పేరునా కోరుచున్నాను.  (ఈ సందర్భంగా ముందుమాటలు రాసిన అభిమాన రచయితలకు మరియు ఈ ప్రయాణంలో సహకారం అందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.🙏 (గమనిక: Kinigeలో సభ్యత్వం ఉన్నవారు మాత్రమే డౌన్ చేసుకోగలరు.)    

Option 2 : Click here to download from eBlogger

అక్కడ  సభ్యత్వం లేనివారికోసం eBlogger నుండి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని విధంగా  Click here అన్న పదం పై నొక్కి డౌన్లోడ్ చేసుకోగలరు 
- మీ లక్ష్మీ రాధిక

No comments:

Post a Comment