#ఆమె
స్వప్నంలో ఉన్న నేను వాస్తవాన్ని గుర్తించలేకపోయాను. ఎప్పుడూ కన్నీటితో నిండే కన్నులను ఏ ఆరా తీయకున్నా, కన్నీటి రాకను మాత్రం పసిగట్టాను. ఎన్ని యుగాల వరకూ అందరాని కాలాలకి నెట్టివేయబడ్డానో, నిన్ను చేరే దారిలేని అలమటింపుదీ విషాదం.!

#అతడు
స్వప్నాలు, వాస్తవాలు అంటూ వేరుగా లేని జీవితాన్ని కోరుకోవడమంటే.. ఆ జీవితంలో నువ్వుండడమే అన్న సత్యం తెలుసుకునే వరకూ ఏ స్వప్నమూ కలగక పోవడమో.. లేదా.. తెలిసే లోపు, వచ్చిన స్వప్నం కరిగిపోవడమో.. మనిషి జీవితంలో ఓ అతి పెద్ద విషాదం కాబోలు.! అందుకే.. కాలం నెట్టేసిందనో, దూరం విడదీసిందనో.. ఏ కారణాలు చెప్పకుండా.. మౌనంగా ఉంటే.. నువ్వు దొరికినట్టుంటుందన్న ఆశకు, అలమటింపును తోడుంచి నేను నీ ఆలోచనల్లో విశ్రమిస్తాను.! ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. నిన్ను చేరడానికి.. ఈ జీవితానికి ఇదో దగ్గరి మార్గం నాకు.!

ఒక ఛాయలా నావెంట నువ్వున్నావనుకున్న భ్రమలో ఉన్నంతసేపూ, మల్లెపువ్వులా నవ్వుతూంటాను. నువ్వు లేవనే విషయం స్ఫురణకొచ్చింది మొదలు, వెతకడం మొదలెడతాను. ముద్దుగా నన్ను తాకే పున్నాగ పూల పరిమళం నువ్విక్కడే ఉన్నావనే మాయ చేసినంతసేపూ ప్రాణం హాయిగా అనిపిస్తుంది. అసలింత ఆదమరపులో నన్నుంచి నువ్వెటు వెళ్ళావో, అలసిపోయిన నన్ను చూసి చెప్పగలవా.!

స్ఫురణకూ ఓ సువాసన ఉంటుందని, ఓ భ్రమకు ఛాయ మాత్రపు సత్యమైనా ఆసరా ఇచ్చి ఉంటుందని, వెతుకులాటల్లో దొరకనివి.. ఒకోసారి వెదుక్కుంటూ వస్తాయని, మాయ చేసి.. ప్రాణానికి హాయినిచ్చి మళ్లీ కనబడకుండా పోయేవి.. ఎటు పోయాయో తెలియక జీవితకాలపు అన్వేషణను కళ్ళకు అద్ది వెళతాయని... సతతమూ, ఆగిపోయిన సమయాల్లో మునిగి పరవశించిపోయే నన్ను చూసి అనుకోగలవా.. చెప్పు.!

నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ చిరు గాలికి కొబ్బరాకులు పాడుతున్న పాటలు వింటుంటే, నాలో గుబులు అధికమవుతుంది. నాకు నేను పరాయిగా మారి హృదయాన్ని కోల్పోతున్నానని తెలుస్తుంటే, ఈ నిర్లిప్తతనేం చెప్పను. సర్వ ప్రపంచమూ జటిల సమయలో ఉన్నప్పుడు సైతం, నేను మాత్రం విహంగంలా అద్యంతాల్లో నిన్నే అన్వేషిస్తున్నాను. పైకి ఓ మూగ శిల్పంగా అగుపించినా, మనో వీధిలో తపోవనమే సృష్టించుకున్నాను. అన్యులకు ప్రవేశం లేని నా ఊహలందుకే.. మూగవయ్యాయి.!

మనసుకు వినిపించే ప్రతిదీ ఓ ప్రణవం, తలుపులకు కనిపించేదల్లా ప్రణయమే.. గుబులు నుండి గుబులుకు నన్ను మోసుకెళ్ళే, నీ పట్ల ఉన్న తీరని మోహమే. మరులు, మనో వికారాలను అలంకరించుకుని వెంటబడే యాతనలో.. ఫలించని నా అన్వేషణే కదూ.. నేనిప్పుడు బతికుండేలా చేస్తోంది., నన్ను నాకు నీ ద్వారా పునః పరిచయం చేస్తోంది.! ఒక్కసారిగా ఎదను ఝల్లుమనిపించి అంతలోనే తరలి పోయే భావాలు తిరిగి తారసపడడం, నేను పోల్చుకునే లోపు.. లోలోనే స్థిరపడి పోవడం ఎంత బావుంటుందో తెలుసా. నా ఊహలు స్వయం ప్రకాశకాలు.. సర్వ విదితాలు అయ్యాయంటే అవి నీ గురించి కలిగినవి కనుకనే.!

ఎదలో ఉప్పెన ఎగిసి వెలసిన ప్రతిసారీ సముద్రమవుతానని విసుక్కోకు. ఆటుపోట్లు సమసిపోయే దిశగానే అలనవుతున్నానని గ్రహించు. ఏమో.. నా గమ్యం, ఇంకెన్ని అనుభవాలకని సమాయత్తమవాలో.. ఇంకెంత నిస్సహాయతను మోయాలో.. ఇంకెన్ని యాంత్రిక స్థితులను దాటాలో.! ఏదేమైనా కొన్ని క్షణాలు మాత్రం శాశ్వతం, మది ఆస్వాదించి సాధించుకున్న స్వార్జితం. ప్రేమాన్వీ, నా ఆర్తనాదాన్ని ప్రశ్నించకు. ఏకాంతంలోంచీ చీకటిలోకి పయనమవుతున్న నన్ను వారించకు. నా భావం, గీతం, ధ్యానం అన్నీ నీతోనే పూర్తవనీ. మరో పదమంటూ ఎప్పుడు పుట్టినా, అది నీకోసమే కావాలి.!

తీరాన్ని చేరి వెనుదిరిగి వచ్చే సముద్రపుటలలకు దిశంటూ ఉంటే.. అది తిరిగి తీరం వైపే నని.. అంతరించిపోయిందనుకున్న ప్రతి అంశలోనూ ఓ జ్ఞాపకం మనిద్దరి వారసత్వంగా మిగులుంటుందని ఇద్దరం గ్రహిద్దాం. స్థితిగతులను దాటామని అనుకోవడమంటేనే మరో పరిస్థితిని ఇంకో గమనానికి కల్పించడమని అర్థం కదా. ఇదో డోలాయమాన యానం.. అంతమే లేని ఆదిమ ప్రణయం.! ప్రియ మనస్వీ.. ప్రత్యేకంగా మనకు ఎరుకపడిన మనవైన భావాలు, గీతాలు, ధ్యానాలు.. మళ్లీ మళ్లీ పుట్టనీ.. మరిలాగే పల్లవిస్తూ సాగనీ.!